వేద న్యూస్, చొప్పదండి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బిజేపి చొప్పదండి పట్టణశాఖ అధ్యక్షుడు చిల్ల శ్రావణ్ ఆద్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో కేట్ కటింగ్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ మాట్లాడుతూ జనహృదయ నేత, పేదల పెన్నిది కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు 20 వేల సైకిల్లను అందించాలన్న గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఘనత కేవలం బండి సంజయ్ కే దక్కిందని వారు అన్నారు. సామాన్య కార్యకర్త నుండి ఆయన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నేడు మంత్రిగా ఎదిగినా పేద ప్రజలకు ఏది అవసరమో తెలిసిన గొప్ప నాయకుడు ఆయన అని, అలాంటి నాయకుని జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కార్యకర్తలందరం కలిసి చొప్పదండి మున్సిపాలిటిలోని పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందించి, అధికారులకు మరియు సిబ్బందికి సీట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మేనేజర్ ప్రశాంత్, అంజయ్య బిజేపీ నాయకులు బత్తిని ప్రశాంత్, మంచికట్ల మల్లేష్, రాజన్నల రాజు, గుండేటి శివశంకర్, సంగ నరేష్, జిట్ట కుమార్, గుర్రం సమర్ రెడ్డి, అనుకారి సాయికృష్ణ, కోటగిరీ ప్రశాంత్, గంగు సంపత్, మెడిచెలిమి చంద్రయ్య, అర్థవెళ్లి శ్రీనివాస్, సంతోష్ గుప్తా, సిరిపురం గంగారాం, సులువ సంతోష్, స్వర్గం కళ్యాణ్, జాగిరి రాజేందర్, బొడిగే ఆదిత్య, గడ్డం రమేష్, దూస రాజు, రంజిత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.