వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ చార్జి, మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు సోలెంకె రాజేశ్వరరావు ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆదివారం దామెర గ్రామానికి వచ్చారు. రాజేశ్వరరావును పరామర్శించి అనారోగ్య పరిస్థితి విషయమై ఆరా తీశారు. సోలెంకె రాజేశ్వరరావు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన వంతు సాయం చేస్తానని చెప్పారు.
బండి సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఆ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి, నాయకులు ఎర్ర గొల్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీ వర్ధన్, కృష్ణయ్య, పల్లెపాటి మధుకర్, అంచనగిరి వెంకటరమణ గణవేన నాగరాజు, తదితర కార్యకర్తలున్నారు.