వేద న్యూస్, డెస్క్ :
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ఆలయం పై అంతస్తులోని మహంకాళి ఆలయంలో వెండి కిరీటం, హుండీ అపహరించారు.
ఆలయ గేటు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని దుండగులు చోరీ చేశారు. పూజారులు పూజ కోసం వెళ్లి చూడగా ఈ చోరీ ఘటన వెలుగు చూసింది. దుండగులు వ్యాసగుడి దగ్గర హుండీని పడేసి వెళ్లారు. ఈ మేరకు ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.