- మరిపెడ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో మరిపెడ పాఠశాలలో ఘనంగా ముందస్తుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు వివిధ రకాలైనటమీ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా వేడుకలు చేశారు.
చివరగా బతుకమ్మలను సాగనంపడానికి ఏర్పాటుచేసిన నీటిలో వదలడం జరిగింది. ఇలాగ సహజమైనటువంటి పూలతో నీరు సుభ్రమై, ఆరోగ్యాన్ని ఇస్తుందని, సహజమైన రంగులతో, పుష్పాలతోనే బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, లెనిన్, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబురావు, అనిత, రాజకుమారి, సుధా, మంజుశ్రీ, పద్మ, భువనేశ్వరి, శంకర్, సుజాత మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.