వేద న్యూస్, ఇల్లంతకుంట:

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించు కుంటున్నారు . బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ‘నానబియ్యం బతుకమ్మ’గా పేర్కొంటారు.

ఈ సందర్భంగా కాసారం మమత మాట్లాడుతూ..నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత అరబెట్టి.. మెత్తగా పిండి చేస్తారనీ,. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న ఉండలు చేస్తారనీ , వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారనీ వివరించారు.

శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారని వెల్లడించారు.

పైడి అనుదీపిక మాట్లాడుతూ..కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి, బియ్యానికి కొదువ ఉండదనీ,. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి అని చెప్పారు. అందుకే.., నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారనీ,పైడి రేవతి, నక్క నవనీ తి ,నిష్వాంతిక తెలిపారు.