వేద న్యూస్, కరీంనగర్:
పూల సింగిడి ‘బతుకమ్మ’ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గౌరీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో 15వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగ సంబురాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా గౌరీ పుత్ర యూత్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని ఈ సందర్భంగా మహిళలు అభిప్రాయపడ్డారు. ‘‘ఒక్కేసి పువ్వేసి చందమామ’’ అంటూ మహిళలు చక్కగా మొదటి రోజు బతుకమ్మ పాటలు పాడారు. తొలి రోజు నుంచి మొదలు సద్దుల బతుకమ్మ వరకు మహిళలు, చిన్నారులు చక్కగా ఆట పాటతో బతుకమ్మ పండుగను నిర్వహించుకోనున్నారు.