• అధ్యక్షులుగా ఎర్ర గిరిధర్

 

వేద న్యూస్,బోయినిపల్లి:

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ బీసీ కాలనీలో యువకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతనంగా బీసీ కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.

ప్రెసిడెంట్ గా ఎర్ర గిరిధర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె గౌషాత్ , సెక్రెటరీ బొమ్మన ప్రదీప్, క్యాషియర్ గరిగంటి వెంకటేష్, గౌరవ అధ్యక్షులుగా దూస వెంకటేష్ , ముఖ్య సలహాదారుడు దూస సంజీవ్, కార్యవర్గ సభ్యులు బత్తిని రాజు, ఎస్.కె.షాదుల్ , పిట్టల అఖిల్ , ఎర్ర చరణ్ , ఊకంటి సతీష్ లను ఎన్నుకున్నారు.

ఈ నూతన కార్యవర్గ ఎన్నికకు సహకరించిన కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.