- త్వరలో జిల్లావ్యాప్తంగా విద్యారంగ సమస్యల అధ్యయన యాత్ర
- బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్
వేద న్యూస్, ఆసిఫాబాద్:
విద్య రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రావలసిన రూ. 3,600 కోట్లు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది అన్నారు.
త్వరలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల అధ్యయన యాత్ర నిర్వహిస్తామని జిల్లాలో ఉన్న సంక్షేమ ఆస్తులను గురుకుల విద్యాలయాలను ప్రభుత్వ పాఠశాలను కళాశాలలను సందర్శించి.. ఆయా విద్యాలయాలు హాస్టల్లో నెలకొన్న సమస్యలని అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమిస్తామన్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పానీయాల ప్రభావంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.