వేద న్యూస్, చొప్పదండి :

 

చొప్పదండి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణం మందు బాబులకు అడ్డా గా మారుతున్నది.

పాఠశాలకు సరయిన కాంపౌండ్ లేక పోవడం, రాత్రి సమయాల్లో స్కూల్ ఆవరణ లో ఇది వరకు ఏర్పాటు చేసిన హై మాక్స్ లైట్లు పని చేయకపోవడం, స్కూల్ గ్రౌండ్ ఆట స్థలం లో నిత్యం ప్రొద్దున, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే వారు ఇన్ని పరిస్థితుల్లో మందు బాబులకు ఈ స్కూల్ ఆవరణ వారికి మంచి అడ్డా గా మారుతు న్న ది.

 

 

రాత్రి పూట లైట్లు వెలగాల్సి ఉండేలా చూసుకోవాలని మున్సిపాలిటీ వారిని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నూతనంగా నిర్మించిన వంటశాల నిరుపయోగంగా ఉండటం దాని ప్రక్కన ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి.