•  ఉల్లం‘ఘనుల’కు రూ.10 వేల జరిమానా..
  • ‘బెల్ట్’ నిర్వహణ సమాచారమిచ్చిన వారికి రూ.2వేల నజరానా

వేద న్యూస్, ఇల్లందకుంట:
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని లక్ష్మాజీపల్లి గ్రామ సర్పంచ్ ముస్కే రేణుక ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల (జనవరి) 10 నుంచి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ పంచాయతీ శుక్రవారం తీర్మానం చేసింది. గ్రామ సమాఖ్య సంఘాలు, కుల సంఘాలు, గ్రామ ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకవర్గం వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా వేయనున్నట్టు హెచ్చరించారు. బెల్ట్ షాపుల నిర్వహణపై సమాచారమిచ్చిన వారికి రూ.2 వేల నజరానాను ప్రకటించారు.