వేద న్యూస్, మఠంపల్లి:
భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన మఠంపల్లి లో గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు రంగా నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈసందర్బంగా రంగా నాయక్ మాట్లాడుతూ పేదల పెన్నిద్ది, అన్నా అంటే నేనున్నా అంటూ అందరి వాడిగా ఉన్న భాగ్యరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు.
ఈకార్యక్రమంలో బి జె పి మండల ప్రధాన కార్యదర్శి రావుల హస్సేన్ గౌడ్, మైనారిటీ మోర్చా నాయకులు ఎస్ డి రసూల్, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు ఆరాల సైదులు, ఆరాల అంజి, కేతేపల్లి జోష్, కొమ్ము కోటి తదితరులు పాల్గొన్నారు.
