తెలంగాణలో పల్లెల్లో పల్లెలు చెట్లతో కలకలాడాలని పచ్చదనం వెలివేర్చాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆయన సంకల్పించారు. అయితే వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామములో పల్లె ప్రకృతి వనం లక్షల రూపాయల వ్యయంతో పల్లె పచ్చదనంతో కళకళలాడాలని 2020లో ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలను పెంచారు. కానీ సంరక్షణ బాధ్యతను మరిచారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనంలో యువత మద్యం తాగడానికి, సిగరెట్టు కాల్చేందుకు వినియోగించుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం “వేద న్యూస్” ప్రతినిధి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించడంతో బీరు సీసాలు,సిగరెట్లతో దర్శనమిచ్చాయి.
Oplus_16908288
ఇప్పటికైనా సంబంధించిన అధికారులు లక్షల రూపాయల ఖర్చు పెట్టి పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.