వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్..సోమవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి మాజీ ఎమ్మెల్యే సతీశ్ ను కలవగా, ఆయన భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా రైతులకు అండగా నిలవాలని, అన్నదాత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రహ్లాద్ రావుతో కలిసి సతీశ్ కుమార్ కు పుష్పగుచ్ఛం అందించి..ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 శుభాకాంక్షలు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని, అన్నదాతకు అండగా తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున ఉంటామని, పోరాడుతామని ఈ సందర్భంగా భాస్కర్ పేర్కొన్నారు.
