DYCM Batti VikramarkaDYCM Batti Vikramarka

వేదన్యూస్ – డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం 

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఈ సమస్యను బయట ప్రపంచాన్నే ఆకర్శించడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే. హెచ్ సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వం రూల్స్ ను అతిక్రమిస్తే ఏకంగా సీఎస్ అయిన సరే జైలుకి పంపిస్తాము అని పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఈ విషయంలో ఇటు ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనే నెపంతో హెచ్ సీయూ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.  అంతేకాకుండా ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి మరి సంగారెడ్డి జైళ్లో పెట్టించారు ముఖ్యమంత్రి. ఈరోజు సోమవారం  డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో హెచ్ సీయూ టీచర్స్ అసోసియేషన్ , పీపుల్స్ అసోసియేషన్ , ప్రజా సంఘాలు, మేధావులతో క్యాబినెట్ సభ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు ఆధ్యక్షతన సమావేశమైంది.

ఈ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం అక్రమంగా హెచ్ సీయూ విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇద్దర్ని సంగారెడ్డి జైలుకి పంపారు అని వివరించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నీంటిని వెనక్కి తీసుకోవాలి. సంగారెడ్డి జైల్లో ఉన్న ఇద్దరు విద్యార్థులను భేషరత్ గా విడిచిపెట్టి కేసులన్నీ తక్షణమే ఉపసంహారించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు, టీచర్స్ కమిటీ స్పందిస్తూ ఒంటెద్దు పోకడ పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాజా ఆదేశాలతో బ్రేకులు వేశారు. గట్టి షాకిచ్చరు. ఇకనైన సోయిలోకి వచ్చి నడుచుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.