వేదన్యూస్ – వరంగల్ కమీషనరేట్
భారతరాష్ట్ర సమితికి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్ముకున్నాయా..?. అసలు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న ఆ పార్టీ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ఆశలపై వరంగల్ పోలీస్ డిపార్ట్మెంట్ నీళ్లు చల్లనున్నారా..?.
అంటే ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిస్థితులను బట్టి అవుననే అనోచ్చు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ కమీషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఈరోజు నుండి అమలు కానున్నట్లు తెలిపారు. దీంతో ఈనెల ఆరో తారీఖు నుండి ముప్పై రోజుల పాటు ఈ యాక్ట్ అమల్లో ఉండనున్నది.
ఈ యాక్ట్ ప్రకారం భారీ బహిరంగ సభలు.. ర్యాలీలు .. ఊరేగింపులు నిర్వహించకూడదు. ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు .. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఈ భారీ బహిరంగ సభకు అనుమతి కోసం సీపీని కలిసి లేఖ ఇచ్చారు. సభ జరగనున్న ఎల్కతుర్తి కమీషనరేట్ పరిధిలోకి రానున్నది. దీంతో ఈ సభ జరగనున్నాదా.. ? లేదా అన్నది మున్ముందు తెలుస్తుంది.