వేదన్యూస్ – హైదరాబాద్
ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో రేపు బుధవారం కాళేశ్వరం కమీషన్ ఛైర్మన్ జస్టీస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం కృంగుబాటు ఘటనలో రాజకీయ నేతలను విచారించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులను విచారించిన కమీషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావును విచారించనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న కమీషన్ ఉన్నట్లు ఉండి హైదరాబాద్ కు చేరుకోనుండటంతో త్వరలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుండి ప్రజల దృష్టి.. మీడియా దృష్టిని మళ్లించడానికే అని ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.