వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:

బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్నపేట గ్రామ శివారులో బైక్ దొంగతనం జరిగింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సోమవారం నిందితుడు బానోతు తిరుపతి పట్టుకొని.. అతని దగ్గర నుండి బండిని రికవరీ చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు ఎస్ఐ తెలిపారు.