- లడ్డుల కేంద్రం వద్ద ప్రైవేటు వ్యక్తులు ఇష్టరాజ్యంగా క్యారీబ్యాగ్స్ విక్రయాలు
- ఎస్పిఎఫ్, హోంగార్డ్ హస్తం ఉందంటూ ఆరోపణలు
వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి:
వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద దర్జాగా
ప్రవేటు వ్యక్తులు క్యారీబ్యాగ్స్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే వేలది మంది భక్తులు ప్రసాదాలు తీసుకొని వెళుతున్న సందర్భంలో క్యారీ బ్యాగులు ప్రైవేట్ వ్యక్తులు ఇష్టాను రీతిగా ఎవరికి భయపడేది లేదు దర్జాగా విక్రయిస్తున్నారు.
ఆలయ అధికారులు సంబంధిత ఈవో, ఏఈఓలు మరియు ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యారీ బ్యాగ్ అమ్ముకునే వ్యక్తుల వద్ద రోజువారిగా డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపలు సైతం బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని దేవస్థానం చిత్రాన్ని ముద్రించి కౌంటర్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
