వేద న్యూస్, వరంగల్ :

గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల 100 ఫీట్ల రోడ్డు సర్కిల్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పత్తి కుమార్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుమారుడు దిలీప్ రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువకులు రక్త దానం చేసి పండ్ల పంపిణీ చేశారు.

అనంతరం పత్తి కుమార్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బడుగు బలహీన వర్గాలకు తోడ్పాటును అందించే చరిత్ర ఉందని అన్నారు.

14వ డివిజన్ లో ప్రజలకు మా సేవలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్, అభిలాష్, ప్రశాంత్, సిలువేరు శ్రీధర్, కొల్లూరి డానియెల్, భరత్, పత్రి శంకర్, పత్తి రాజేష్, గూడూరు కృష్ణ, మహమ్మద్ పాషా, యూసుఫ్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డోనర్ మోటివేటర్ ఆర్ కళ్యాణి, ఇంటెర్న్ డా. సాయి వెంకట పవన్, ఇంటర్న్ డా. విశ్వనాథ్, స్టాఫ్ నర్స్ ప్రేమలత, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.