- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితా రెడ్డి
- మానసిక దివ్యాంగుల మధ్య యోషిత పుట్టిన రోజు వేడుకలు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
పుట్టిన రోజు వేడుకల పేరిట పార్టీలకు డబ్బు వృథా చేయకుండా మానసిక దివ్యాంగుల మధ్య వేడుకలు జరుపుకోవడం మంచి నిర్ణయమని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె అధ్యక్షతన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మనవరాలు యోషితా రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అయితే, ఆ వేడుకలు వరంగల్ రైల్వే స్టేషను సమీపంలోని డాన్ బాస్కో వీధి బాలల ఆశ్రయం పిల్లల నడుమ నిర్వహించడం విశేషం.
యోషిత ఆశ్రయ పిల్లల మధ్య కేక్ కట్ చేసి..అనంతరం పిల్లలకు బుక్స్, బియ్యం, ఫ్రూట్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మర్రి యాదవ రెడ్డి సతీమణి నీరజ మాట్లాడుతూ మనవరాలు సింగపూర్ లో ఉంటారని, తన మనవరాలు పుట్టిన రోజు వేడుకలు ఇలా కల్మషము ఎరుగని పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషము గా ఉందని చెప్పారు.
అందరిలో స్ఫూర్తి నింపేలా మర్రి యోషిత బర్త్ డే వేడుకలు మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకోవడం సంతోషకరమని అనితారెడ్డి వెల్లడించారు. బర్త్ డే వేడుకలలో భాగంగా పిల్లలు సంతోషంతో కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో మర్రి నీరజ, డాక్టర్ అనితా రెడ్డి, బ్రదర్ మిల్కి, దివ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
