• బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ 

వేద న్యూస్, ఎల్కతుర్తి:

 రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పెక్సీలు పెట్టి ఆ పార్టీ  వారి చేత సన్నిబియ్యం పంపిణీ చేపట్టడం సిగ్గుచేటు అని  బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ విమర్శించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆయన  మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. సన్న బియ్యం విషయంలో ఎవరి క్రెడిట్ ఎంత.. ? కేంద్రం ఎంత ఖర్చు చేస్తుంది..?  అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడానికి సంకోచిస్తున్నదని పేర్కొన్నారు. 

 

సొమ్ము ఒకడిది సోకొకరిది  అన్న చందంగా ప్రభుత్వం రేషన్ దుకాణాల ముందు కాంగ్రెస్ లీడర్ల ఫ్లెక్సీల ఏర్పాటు సరికాదని వెల్లడించారు.  సన్న బియ్యం పంపిన పథకంలో ఒక కిలో బియ్యం కు రూ. 40 ఖర్చు కేంద్రం భరించగా, రూ.10  మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందని వివరించారు. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? రాష్ట్రం ఎంత ఇస్తుందని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. అసలు కరోనా నుండి కేంద్ర ప్రభుత్వమే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రజలకు అన్ని విధాల సహకారంతో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం వచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం అందించిన సంగతి మర్చిపోవద్దని ఉద్ఘాటించారు. 

కనీసం రేషన్ షాపులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్ ఫొటోలు పెట్టకపోగా, రాజకీయ కోణంలో రేషన్ షాప్ లో వారి పార్టీ కి సంబంధించిన వ్యక్తులచే బియ్యం పంపిణీ చేయడాన్ని గమనించి.. జిల్లా కలెక్టర్ కచ్చితంగా రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ పక్షాన కచ్చితంగా నిలదీస్తామని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. తక్షణమే రేషన్ షాపులో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫొటోలు పెట్టాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి  ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ , సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య , ముశ్కే వెంకటేష్ యాదవ్, జనగాని కిష్టయ్య. ఆడెపు శ్రీ వర్ధన్. చిదురల వెంకటేష్.నాంపల్లి అశోక్. కోడం రమేష్. ఎర్రగొల్ల రాజు ..తోట మల్లయ్య .అల్లి కుమారస్వామి .ఠాగూర్ శ్యాంసింగ్. వేల్పుల శ్రీనివాస్.బొక్కలపాటి కుమార్. తదితరులు పాల్గొన్నారు.