- బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవి ధీమా
వేద న్యూస్, బెల్లంపల్లి :
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే, మేనిఫెస్టో లో పెట్టిన పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ఏరియాలో అనంతరం నెన్నెల మండల కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, నిరుద్యోగం పోవాలంటే రాష్ట్రంలో, నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. రాబోయే కాలంలో డబల్ ఇంజన్ బిజెపి సర్కార్ తోనే యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, స్థానిక ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ అధికార దాహంతో నియోజకవర్గ ప్రజల అవసరాలను తెలుసుకోకుండా కేవలం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
తాను నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల అవసరాలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన న్యాయం చేసే విధంగా, అధికారులు చేసే నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండ కడుతూ ఉంటానని, తనను గెలిపిస్తే ప్రజలకు మరింత న్యాయం చేస్తానని తెలిపారు.
దేశవ్యాప్తంగా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని, తెలంగాణలో సైతం బిజెపి అధికారం చేపడితే ప్రజలకు మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ బిజెపి పార్టీ రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చేలా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.