వేద న్యూస్, హుస్నాబాద్:
హైదరాబాద్ లో గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో పాటు బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
