- కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ సాధిస్తాం
- బీజీపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్
వేద న్యూస్, జమ్మికుంట:
ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించినప్పటికీ, కేవలం బీజేపీ మాత్రమే బడుగు బలహీనవర్గాల బిడ్డ బండి సంజయ్ కుమార్ కి టికెట్ కేటాయించడంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు బండి సంజయ్ కుమార్ కు మద్దతు తెలుపుతున్నాయని, ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ కూడా ఇస్తామని ప్రజలు కార్యకర్తలకు నిరాజనం పలుకుతున్నారని బీజీపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తెలిపారు.

జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కలగూ డెం గ్రామంలో ఆయన బీజేపీ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బండి సంజయ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ ఎంపీలకు 27 మందికి మంత్రి పదవి ఇచ్చి, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పేద ప్రజల కోసం ఉచితపరేషన్ అందిస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఆకుల కిషన్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఉడుగుల రవికుమార్, సంపత్, పల్లెపు రవి, తాటి కంటి మల్లయ్య, ఎగ్గని చందు, ములుగురి అఖిల్, హరి ప్రసాద్, అరుణ్, విష్ణు కమల్, సిద్దు, దాసరపు అన్వేష్, పాతకాల విష్ణు, గుల్లి చరణ్, ఇల్లందుల శ్రీనాథ్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.