- ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
- పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం
వేద న్యూస్, వరంగల్:
బీజేపీ పార్టీ పిలుస్తోందని, ప్రతీ ఒక్కరూ బీజేపీలో చేరాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ధర్మారంలోని పార్టీ కార్యాలయంలో ‘బీజేపీ లో చేరండి’ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ బూత్ పటిష్టత, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్య మన్నారు. ప్రతీ ఇంటికి కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందేలా నవభారత నిర్మాణం కోసం పని చేస్తున్న ప్రధాని మోడీ రుణం తీర్చేలా పని చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
పేదల గడపల్లో నాటి రామరాజ్యం వచ్చేలా దేశ భవిష్యత్ కు బంగారు బాట వేసేందుకు ప్రతీ ఒక్కరు బీజేపీలో చేరాలని అన్నారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను బూత్ స్థాయిలో ప్రతీ గడపకూ చేరేలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. ఈ నెల 11 నుంచి 26 వరకు జరిగే ఈ కార్యక్రమంలో బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతీ బూత్ నుంచి ఐదుగురిని ( 5 ) పార్టీలో చేర్పించాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని, ఇందుకోసం ప్రతీ బీజేపీ నాయకుడు, కార్యకర్త శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు.
మోడీ ఓరుగల్లు జిల్లాకు ఎన్నో పథకాలు కేటాయించారని పేర్కొన్నారు. ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సీట్లను కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రత్నం సతీష్ షా, ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, రేసు శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్లు వడ్డేపల్లి నరసింహులు, ముత్తిరెడ్డి కేశవరెడ్డి, ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, కంభంపాటి పుల్లారావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్న ప్రభాకర్, నర్సంపేట టౌన్ అధ్యక్షులు బాల్నే జగన్, బీజేపీ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కందిమల్ల మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బండారి కళ్యాణి, యువ మోర్చా అధ్యక్షులు భరత్ వీర్, మరియు పదాధికారులు, పలు డివిజన్ అధ్యక్షులు, పలు మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.