• బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రైవేట్ విద్యను పూర్తిగా వ్యాపారంగా చేసి.. బుక్స్ యూనిఫార్మ్స్, ఇతర సామగ్రి తాము అనుకున్నట్టుగానే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

బుక్ స్టాల్స్ తో.. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల విషయంలో సైతం అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వెల్లడించారు. ఈ విషయాలన్నింటిపై విద్యాశాఖ జిల్లా అధికారులకు తెలియజేసి, విద్యార్థులు తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.