• రక్తదానం..ప్రాణదానమే

వేద న్యూస్, నల్లబెల్లి :

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలోసోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

నల్లబెల్లి ఎస్ఐ వి. గోవర్ధన్ ఆధ్వర్యంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ వరంగల్ ఉపాధ్యక్షులు,నల్లబెల్లి కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, కొమ్మురాజు, నల్లబెల్లి మండల ఆటో యూనియన్ అధ్యక్షులు రెడ్డి ప్రశాంత్, యూనియన్ సభ్యులు విద్యార్థులు, దాదాపు 20 మంది పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై వి. గోవర్ధన్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కాపాడడానికి ఈ రక్త ఎంతో ఉపయోగకరం అని తెలిపారు.

రక్తహీనత వల్ల ప్రమాదాల వల్ల గర్భిణీ స్త్రీలకు తగిన రక్తం లేక ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూచించారు. ఈ సందర్భంగా కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొమ్మురాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం సందర్భంగా రక్తదానం ఇవ్వడం తనకి ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మోటార్ బైకులపై ప్రయాణించేటప్పుడు పరిమిత వేగంతో ప్రయాణించాలంటు అతివేగంతో మోటార్ సైకిల్ నడిపి కన్నవారికి కన్నీటి వేదను మిగిల్చవద్దన్నారు. అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐ సాయి రమణ, ఎస్సై వి. గోవర్ధన్, హోంగార్డ్ రమేష్, నల్లబెల్లి మండలం కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొమ్మురాజు, నల్లబెల్లి మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు రెడ్డి ప్రశాంత్, యూనియన్ సభ్యులు పల్లికొండ రవి, శ్రీను, సారంగం, శ్రీనివాస్ శ్రీనివాస్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.