వేద న్యూస్, వరంగల్:

జూలై 9 న, ఇతర కార్మిక సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాయని, ఇందులో భారతీయ మజ్దూర్ సంఘ్ (అఖిల భారతీయ విద్యుత్ మజ్దూర్ మహా సంఘ్) చేర్చబడలేదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.శశి కుమార్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్, రిజిస్ట్రేషన్ నెంబర్. జి -455 (భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధం ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, కంపెనీ అధ్యక్ష కార్యదర్శులకు, కంపెనీ కార్యవర్గ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, డివిజన్ కార్యవర్గ సభ్యులకు , మరియు యూనియన్ సభ్యులకు ఈ సంగతి తెలియజేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటన లో వెల్లడించారు.

ఈ సమ్మె రాజకీయంగా ప్రేరేపించబడిందనీ ఆరోపించారు. జూలై 05, 6 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో జరిగిన అఖిల భారతీయ విద్యుత్ మజ్దూర్ మహా సంఘ్ కార్యనిర్వాహక సమావేశంలో, విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ప్రత్యేక ఆందోళన నిర్వహించాలని నిర్ణయించి నట్టు పేర్కొన్నారు.

 ఆఫీస్ బేరర్లు, కార్యకర్త సోదరులు, యూనియన్ సభ్యులందరూ ఈ నెల 9న యథావిధిగా తమ తమ పనులకు వెళ్లి ..పరిశ్రమ, దేశం అభివృద్ధిలో పాల్గొనేలా చూసుకోవాలి అని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.శశి కుమార్ తెలియజేశారు.