వేద న్యూస్, ఖమ్మం:

జిల్లా కేంద్రమైన ఖమ్మం లో బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా యూనియన్ ఎన్నికల్లో బోయిన సైదులు ప్యానల్ ఘన విజయం సాధించింది. బోయిన సైదులు, మాచర్ల తిరుమల రావు ప్యాలన్ల మధ్య జరిగిన హోరా హారి ఎన్నికల్లో బోయిన సైదులు ప్యానల్ అభ్యర్థులు గెలుపొందారు.

ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బోయిన సైదులు మంగళవారం మాట్లాడుతూ.. పెయింటింగ్ వర్కర్స్ కు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. తన ఎన్నికకు సహకరించిన మేస్త్రీలకు, వర్కర్స్‌కు తన  ప్యానల్ తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.