•  నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేయగా డి వై ఎఫ్ ఐ విద్యార్థి నాయకులు పట్టుకొని ఎంఈఓ కు, మీడియాకు సమాచారం అందించారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం.. మాజీ జెడ్పిటిసి కార్యాలయం పక్క షట్టర్లో పుస్తకాలను డంపు చేసి విద్యార్థులకు వారే స్వయంగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ మండిపడ్డారు.

శ్రీ చైతన్య యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. అదేవిధంగా ఎంఈఓ ఆఫీసుకు కూత వేటు దూరంలో పుస్తకాలు అమ్ముతుండడం అధికారులకు ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు.

వెంటనే పుస్తకాల స్టోర్ ను సీజ్ చేసి విద్యాసంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు.