వేదన్యూస్ – దుబ్బాక
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పది హేను నెలల పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. గల్లీ నుండి హైదరాబాద్ వరకూ అన్ని వర్గాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని కొంతమంది పెద్దలు.. వ్యాపారవేత్తలు మాకు డబ్బులు ఆపర్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.