-మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్

వేద న్యూస్, కాజీపేట :

హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష అని మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ అన్నారు.శుక్రవారం కాజీపేట మీడియా పాయింట్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వినయ్ భాస్కర్ దైవదాక్షిన్యాల వల్ల గ్రంథాలయ చైర్మన్ పదవిని హనుమకొండ గ్రంధాలయ చైర్మన్ అజిజ్ ఖాన్ అనుభవిస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనారిటీ పెద్దల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో వినయ్ భాస్కర్ సమక్షంలో చేరితే, మైనార్టీ పెద్దల మాటలు విని గ్రంధాలయ చైర్మన్ బాధ్యతలు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వినయ్ భాస్కర్, అజీజ్ ఖాన్ కు అప్పగించారని అన్నారు. పార్టీలో ఉన్న వ్యక్తులకు కాకుండా కొత్తగా వచ్చిన అతనికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారని అజీజ్ ఖాన్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి తమ స్థాయిని మించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఎండి షఫీ, ఎండి అఫ్జల్ పాషా, నయీమ్ జుబేర్, మతిన్, పర్వీన్ ఖాన్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.