వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలకేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, రైతు రుణమాఫీ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగా రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మి, వార్డు సభ్యులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.