- గులాబీమయంగా సుల్తానాబాద్ 9వ వార్డు
- ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టిన పుష్పలత
వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టం మహేష్ ఆధ్వర్యంలో 9వ వార్డు శుక్రవారం గులాబీమయంగా మారింది. ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి దాసరి పుష్పలత ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
