• ఆ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి మనోహర్ రెడ్డి
  • సుల్తానాబాద్ మండలంలో దాసరి ప్రచారం

వేద న్యూస్, సుల్తానాబాద్:
నిరుపేదలకు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో గడపగడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.

ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, కెసిఆర్ కిట్టు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.

అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మద్దని, నమ్మి మొండి చేయికి ఓటు వేస్తే తిరిగి కష్టాలు మొదలవుతాయన్నారు. నియోజకవర్గంలో గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని, గత తొమ్మిదిన్నరేళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామని వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారంలో జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ పాల రామారావు,ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు,మార్కెట్ ఛైర్మెన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజ మల్లయ్య, రైతు సమితి జిల్లా డైరెక్టర్ కాసర్ల అనంత రెడ్డి, PACS ఛైర్మెన్ జూపల్లి సందీప్ రావు,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సుజాత – రమేష్ , కన్వీనర్ లు శ్రీనివాస్ రెడ్డి, మైలారం నారాయణ, బీసీ అధ్యక్షులు గరిగంటి కుమార్ బాబు, సూర శ్యామ్, పడాల అజయ్,సర్పంచ్ మోరపెల్లి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ అనిత – అంజయ్య,తాళ్లపెల్లి మనోజ్ గౌడ్, మోరపెల్లి తిరుపతి రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం ఎల్లయ్య,పచ్చిక ప్రవీణ్ రెడ్డి, ఉమ్మెంతల సంపత్ రెడ్డి, దాసరి అనిల్, ఎనమల్ల రాజేశ్వరి, వేయిగండ్ల భూమయ్య, మాతంగి రాజయ్య, కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, కుడుదుల లచ్చయ్య, సంపత్, తిరుపతమ్మ,కావేటి శ్రీరాములు,ఓజ్జ సంపత్, కొయ్యడ అరుణ్ ,మండల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.