వేద న్యూస్, ఓరుగల్లు:

వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ను గురువారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.

వినయ్ భాస్కర్ కు పూల మొక్క అందజేశారు.  ఈ సందర్భంగా యువనేత నరేష్ ను వినయ్ భాస్కర్ అభినందించారు.

కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని వెల్లడించారు. కేటీఆర్, కెసిఆర్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.