వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం 13వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు గడపగడపకు తిరిగి సోమవారం ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను డోర్నకల్ నియోజకవర్గంలో డి.ఎస్ రెడ్యా నాయక్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేశారు.

అధిక మెజారిటీతో మరోసారి రెడ్యా నాయక్ ను డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ముదిరెడ్డి వీరారెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, ముచ్చర్ల రాములు, శ్రీనివాస్ రెడ్డి, గందం భద్రయ్య, చింతల వెంకన్న, రమేష్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.