వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యా నాయక్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10, 11 వార్డులలో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో రెడ్యా నాయక్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ప్రచారంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు,
10వ వార్డు అధ్యక్షులు ఎడెల్లి ఉప్పలయ్య, సైదులు, రవి, సురేష్, కృష్ణ, గోపయ్య, గోల్కొండ వెంకన్న, లక్ష్మయ్య, సత్త్యం ఇద్దయ్య,వెంకటేష్,మల్లయ్య, బొందయ్య, వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.