• పోలీస్ స్టేషన్‌లో గులాబీ లీడర్ల కంప్లయింట్

వేద న్యూస్, శాయంపేట:

గోవిందాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని..గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం చింపి వేశారని బీఆర్ఎస్ శాయంపేట మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, గోవిందాపూర్ గ్రామశాఖ గులాబీ పార్టీ అధ్యక్షులు నర్ర రాజు  శాయంపేట పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మీడియాకు సోమవారం వెల్లడించారు.

గతంలో కూడా భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించిన సిసి రోడ్డు శిలాఫలకాన్ని కూడా పగలగొట్టగా, దానిపై గతంలో కంప్లయింట్ చేసినట్టు వారు గుర్తు చేశారు.  తమ ఫిర్యాదు విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్టు గులాబీ పార్టీ లీడర్లు పేర్కొన్నారు.