వేద న్యూస్, వరంగల్:
బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సాక్షిగా నిరసన తెలిపే హక్కును రాష్ట్ర సర్కారు తృణప్రాయంగా అణచివేస్తున్నదని బీఆర్ఎస్ గీసుగొండ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నాచౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చలో ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమనికి వెళ్లకుండా పింక్ పార్టీ లీడర్లను అరెస్టు చేయడం పట్ల ఫైర్ అయ్యారు. గీసుగొండ మండల బీఆర్ఎస్ నాయకులు మనుగొండ మాజీ సర్పంచ్ నమిండ్ల రమ రాజు, గీసుగొండ మండల యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, దళితబంధు సాధనసమితి మండల అధ్యక్షులు కోట ప్రమోద్ ను పోలీసులు అరెస్టు చేశారు.