వేద న్యూస్, మరిపెడ:
గత కొద్ది రోజుల క్రితం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాసిపంగు వీరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ నాయకులు ఆయన్ను పరామర్శించారు.
మరిపెడ మున్సిపాలిటీ ఎస్టీ సెల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,బాలాజీ నాయక్,బిఅర్ఎస్ పార్టీ నాయకులు పానుగోతు వెంకన్న,వెంకు రవి తదితరులు వీరబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. వీర బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.