Anumula revanth reddy

వేదన్యూస్ – జూబ్లీహిల్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈరోజు మంగళవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.

ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా తన కుటుంబ సభ్యులతో కల్సి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

ఈ వివాహానికి తప్పనిసరిగా వస్తానని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీఎల్ఆర్ కు హామీచ్చినట్లు తెలుస్తుంది. బీఎల్ఆర్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు పలువురు ఉన్నారు.