BRS

వేదన్యూస్ – హైదరాబాద్ 

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వివాద స్పద నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

మాజీ మంత్రి. ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడు తూ ” మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు యూనివర్సిటీకి చెందిన భూములు ఎవరి దగ్గర ఉన్న వెనక్కి తీసుకుంటాము.

అలా వెనక్కి తీసుకున్న భూములను హైదరాబాద్ లోనే “ది బెస్ట్ ఏకో పార్కు” గా అభివృద్ధి చేస్తాము. ఎవరూ ఆ భూముల ను కొనవద్దు. కొన్న కానీ తిరిగి మేము వెనక్కి తీస్కుంటామని హెచ్చారించారు.ముందే చెబుతున్నాము మళ్లీ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీ భూములు వెనక్కి తీసుకోవడం ఖాయం అని ఉద్ఘాటించారు.