- వినూత్న శైలిలో సెలబ్రేషన్స్ ‘బృందావనం’ స్పెషాలిటీ
- ప్రజలు కోరిన రీతిలో చక్కగా ఈవెంట్స్ నిర్వహణ
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రతీ ఈవెంట్‌ను ఉత్సవంలా.. వినూత్న శైలిలో ప్రజలు కోరిన రీతిలో ‘బృందావనం ఈవెంట్స్’ వారు నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్ నిర్వహణలో సుమారు 8 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన నిర్వాహకులు వై.శ్రీనాథ్.. ఇప్పటి వరకు చాలా శుభకార్యాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

జమ్మికుంట పట్టణవాసులు, సమీప పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆయన తన ఆఫీసును జమ్మికుంట పట్టణంలోని మురళీ థియేటర్ ఎదురుగా ఇటీవల ప్రారంభించారు. 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ.. జనం ప్రతీ ఈవెంట్‌ను వేడుకలా సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు శ్రీనాథ్ వెల్లడించారు.
అందరు ఆదరించేలా ఏర్పాట్లు
వేడుకల్లో సంప్రదాయతకు ఆధునికతను జోడించి అందరినీ ఆకట్టుకునేలా జాగ్రత్త వహిస్తున్నారు.
e-తరం యువతను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారుల ఆలోచన, సూచన మేరకు తగు రీతిలో బడ్జెట్ డిసైడ్ చేసుకుని వారు కోరిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వారి బడ్జెట్ పరిధిలోనే చక్కటి ఏర్పాట్లు చేసి వారి మెప్పు పొందుతున్నారు. పాండాస్, హౌజ్ లైటింగ్, హల్దీ మంగళ స్నానాలు, గుర్రపు బగ్గీలు, లైటింగ్, రష్యన్ భామలతో వెల్కమ్, డిఫరెంట్ ఎంట్రీ కాన్సెప్ట్ తదితరాలన్నింటినీ ‘బృందావనం ఈవెంట్స్’ వారు చేపడుతున్నారు.

వేడుక.. పది కాలాల పాటు గుర్తుండేలా ఈవెంట్స్ నిర్వహణ : నిర్వాహకులు శ్రీనాథ్
ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే ఈవెంట్స్‌ను ఉత్సవంలా సెలబ్రేట్ చేసి ఆ మధుర క్షణాలను తమ మదిలో వారు పదిలపరుచుకునే విధంగా వైభవోపేతంగా వేడుకలు నిర్వహిస్తాం. బడ్జెట్‌ను బట్టి వారు కోరిన రీతిలో అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఏ టు జెడ్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం బృందావనం ఈవెంట్స్ స్పెషాలిటీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఉండే మధుర క్షణాలను, ముఖ్యంగా వేడుకలను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చక్కగా ఈవెంట్స్ నిర్వహించడమే మా లక్ష్యం. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదా ఈవెంట్స్‌ను ఉత్సవంలా ‘బృందావనం ఈవెంట్స్’ ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలనుకునే వారు 99498 81130 ఫోన్ నంబర్‌ను సంప్రదించొచ్చు.