• ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ వినతి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని తాటికొండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మాధవరావు కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తాటికొండ గ్రామానికి గత 35 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం ఉండేదని కానీ, గత 6 నెలల నుండి బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

తాటికొండ గ్రామ జనాభా సుమారు 7 వేల వరకు ఉంటుందని, అదేవిధంగా దీని పక్కన కొత్తపల్లి గ్రామంలో 2 వేల మంది గ్రామస్తులు ఉన్నారని వివరించారు. కాబట్టి గ్రామస్తులకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు సౌకర్యం ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రజలు, ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుటకు ఉపయోగపడుతుందని తెలపిరాు. బస్సు సౌకర్యం లేని ప్రతీ గ్రామంలో కూడా బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు.