వేదన్యూస్ -గాంధీ భవన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా..?. ఒకపక్క ప్రభుత్వం పై రోజురోజుకి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించుకోవడంలో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో పార్టీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందా..?. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ ఇంకా ఆలస్యమవుతుందా..?. ఇప్పటికే విద్యా శాఖ, హోం శాఖ మంత్రి లేక నేరాలు ఎక్కువైపోతున్నాయి.
నిత్యం ప్రభుత్వ బడుల్లో ఎక్కడోక చోట విద్యార్థులు ఆస్వస్థతకు గురి కావడం.. ఆత్మహత్యలు చేస్కోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి వర్గ ఉగాది తర్వాత జరగాల్సి ఇంకొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్సీ .. టీపీసీసీ చీఫ్ బొమ్మన మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు.. సమస్యలు ఉన్నాయి.
వీటన్నింటిని త్వరలోనే పరిష్కరించి ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణ అనేది కులాలు.. ప్రాంతాలు సామాజిక కోణంలో ఉంటుంది. ఈసారి మైనార్టీ వర్గాలకు చోటు కల్పిస్తాము. బీసీల తరపున ఇద్దరు గౌడలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని కోరాము అని ఆయన అన్నారు. అంటే దీంతో మరికొన్నాళ్ల పాటు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉందన్నమాట.