• సామాజిక స్పృహ పెంపు లక్ష్యంగా..
  • ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ 
  •  డేటా సైన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమానికి పలువురి ప్రశంస

వేద న్యూస్, వరంగల్:

విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంలో భాగంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో డేటా సైన్స్ విభాగము ఆధ్వర్యంలో “కేరింగ్ హాండ్స్ క్లబ్” శనివారం ఘనంగా ప్రారంభమైంది.

ప్రారంభ కార్యక్రమంగా ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. కె.ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుపతి రావు, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డా. శశిధర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. బెనర్జీ, సిఎస్‌ఈ (డేటా సైన్స్) హెచ్ వోడీ డా. అయేషా బాను, ఫ్యాకల్టీ సభ్యులు హాజరయ్యారు.

విద్యార్థులను సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడం, వారి జీవితంలో సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధ్యాపకులు తెలిపారు.

సుమారు 250 పై చిలుకు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థులలో సామాజిక బాధ్యతను వృద్ధి చేసే ఈ ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రేరణనిచ్చే విధంగా చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు.