- కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ కు ఎస్ఐ అభినందన
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్.. వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్ సీసీ కెమెరాను అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి,శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు.
ప్రజా శ్రేయస్సు, సమాజ సేవ లో భాగంగా తమవంతుగా సీసీ కెమెరాను పోలీస్ స్టేషన్‌కు అందజేశానని తెలిపారు. ప్రజలకు రక్షణ కవచాలుగా, మరో వైపున పోలీసులకు నిఘా నేత్రాలు నేర పరిశోధనలో సహకరిస్తాయని వెల్లడించారు. సోలార్ సీసీ కెమెరా అందజేసిన మద్దుల ప్రశాంత్ పటేల్‌కు ఎస్సై ఆవుల తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మద్దుల ప్రశాంత్ పటేల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.