వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి  ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను  పీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ప్రారంభించారు.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ సర్కారు ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలనను అందిస్తున్నారని వెల్లడించారు. 

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ ,రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, ఓబిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మండల కాంగ్రెస్ నాయకులు ఈదునూరి సాయికృష్ణ ,కెవి సుబ్బారెడ్డి ,మార్కెట్ డైరెక్టర్ లు రావుల మహిపాల్ రెడ్డి దూదిమెట్ల కొమురయ్య, మాజీ ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు.