వేద న్యూస్, ఎలిగేడు:

భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి  సంబురాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించి అభివృద్ధి చెందిన దేశం గా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బద్దం మల్లారెడ్డి, గడ్డం మల్లారెడ్డి, సతీష్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి , రవి, సురేష్ , స్వరాజ్ , అనిల్, ఓదెలు,పరమేష్, భాస్కర్, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి ,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు